: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ హోంమంత్రి
సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఏపీ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయం వద్ద వీరికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. తరువాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ఖరారు చేసేందుకు సింగపూర్ మంత్రి ఏపీకి వచ్చారు.