: నేడు విశాఖకు వస్తున్న రాష్ట్రపతి, ప్రధాని


విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష వేడుకలకు ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. ఈ మేరకు రాత్రికి వారిద్దరూ విశాఖ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఇక్కడికి వస్తున్నారు. నౌకాదళ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానితో పాటు గవర్నర్ కూడా పాల్గొంటారు. దాంతో ఏడవ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. రేపు జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ప్రధాని గౌరవ అతిథిగా హాజరవుతారు. మరోవైపు ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11వేల నేవీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్ లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • Loading...

More Telugu News