: ప్లేటుపై గరిటెతో కొట్టండి... మధ్యాహ్నం భోజనం మానండి!: కాపులకు ముద్రగడ వినూత్న పిలుపు
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరికాసేపట్లో సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటినే ఆయన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. తునిలో నిర్వహించిన ‘కాపు ఐక్య గర్జన’ హింసాత్మకంగా మారడంతో తాను చేపట్టనున్న ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కూడా కిర్లంపూడి రావద్దని ఆయన కాపులకు సూచించారు. అయితే తన దీక్షకు మద్దతుగా కాపులు వినూత్న ఆందోళనకు దిగాలని ఆయన సూచించారు. తన దీక్షకు మద్దతుగా మధ్యాహ్నం భోజనం మానాలని సూచించిన ఆయన, ప్లేటుపై గరిటెతో కొట్టి నిరసన తెలపాలని వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు ఏపీలోని కాపుల ఇళ్లల్లో ప్లేట్లపై గరిటెలు నాట్యం చేయనున్నాయి.