: తిరుమలలో కారులో మంటలు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. నిండా భక్తులతో వెళుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే మంటలు కారును పూర్తిగా దహించివేసేందుకు ముందుగానే అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ కారును నిలిపివేశాడు. వెంటనే అందులోని భక్తులు దిగిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. భక్తుల్లో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారును తమిళనాడుకు చెందినదిగా అధికారులు గుర్తించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.