: ఉద్యోగం కోసం వచ్చి.. నరకం చూసిన నేపాల్ యువతి!


ఉద్యోగం కోసం నేపాల్ నుంచి వచ్చిన ఒక యువతికి నరకం చూపించిన దారుణ సంఘటన బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో జరిగింది. రామ్ సింగ్ అనే సెక్యూరిటీగార్డు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి నేపాల్ రాజధాని ఖాట్మండులో తనకు తెలిసిన ఒక కుటుంబానికి చెందిన యువతిని ఇక్కడికి రప్పించాడు. సుమారు మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చిన ఆ యువతిని తాను ఉంటున్న గదిలోనే బంధించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతను డ్యూటీకి వెళ్లే సమయంలో ఆమెను లోపల వుంచి, గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు. దీంతో, మూడునెలలుగా నరకవేదన అనుభవించిన నేపాల్ యువతి నిన్న రాత్రి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. ఆ సంస్థ కార్యదర్శి యోగేశ్ సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రామ్ సింగ్ ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News