: ‘ముద్రగడ’ నివాసానికి చేరుకున్న టీడీపీ నేతలు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి కొద్ది నిమిషాల క్రితం టీడీపీ నేతలు చేరుకున్నారు. వెంటనే ముద్రగడతో ఎమ్మెల్యేలు బోండా ఉమ, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు భేటీ అయ్యారు. ప్రస్తుతం వారి చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని, ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చెయ్యాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.