: ఉరి సన్నివేశంలో నటిస్తుండగా ఉచ్చు బిగిసింది!


ఉరి వేసుకునే సన్నివేశంలో నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఉచ్చు బిగియడంతో ఇటలీ నటుడు రాఫెల్ షూమేకర్(27) కోమాలోకి వెళ్లాడు. టీవీకి సంబంధించిన ఓ కార్యక్రమం షూటింగులో ఉరితాడును బిగించుకునే సన్నివేశం చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాఫెల్ ను అక్కడ ఉన్న ఒక వ్యక్తి గమనించడంతో, వెంటనే ఆ ఉచ్చును తప్పించి, మరుక్షణం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై కార్యక్రమ దర్శకులు మాట్లాడుతూ, వాస్తవానికి ఉరి సన్నివేశానికి బదులు డమ్మీ తుపాకీతో కాల్పులు ఉంటాయని, అయితే, తమకు చెప్పకుండా ఆ సన్నివేశాన్ని నటుడు రాఫెల్ ఉరిగా మార్పించారని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News