: నకిలీ కరెన్సీతో దొరికిపోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది!


నకిలీ కరెన్సీని తరలిస్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానయాన సిబ్బంది ముంబై ఎయిర్ పోర్టులో దొరికిపోయారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో సుమారు రూ.2.6 కోట్ల నకిలీ కరెన్సీని తరలిస్తుండగా వారు పట్టుబడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై సంస్థ అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం నిందితులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ తరహా సంఘటనల్లో జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పలుసార్లు పట్టుబడ్డారు.

  • Loading...

More Telugu News