: 7 వరకు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రద్దు!
ఈ నెల 7వ తేదీ వరకు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు డీఆర్ఎం అశోక్ కుమార్ వెల్లడించారు. 8వ తేదీ నుంచి ఈ ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. కాగా, నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సదస్సు అనంతరం జరిగిన విధ్వంసంలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం చేశారు. ఈ ఘటనలో రైలు ఇంజన్ తో పాటు సాధారణ, ఏసీ బోగీలు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.