: సెక్షన్-8 అమలు చేయకపోతే... మరో బీహారే!: దాసోజు శ్రవణ్
హైదరాబాద్ లో సెక్షన్-8 అమలు చేయకపోతే... ఇది మరో బీహార్ లా మారుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం, పోలీసులు కలిసి పాతబస్తీలో అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. ఎంఐఎం అంటే టీఆర్ఎస్ భయపడుతోందని ఆయన విమర్శించారు. దాడికి గురైన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం అన్యాయమని శ్రవణ్ మండిపడ్డారు.