: ఉత్తమ్, షబ్బీర్ లపై దాడి ఘటనలో నలుగురికి బెయిల్
కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై పాతబస్తీలో దాడి చేసిన నలుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు కషఫ్, అబేద్, మసీ ఉద్దీన్, మిస్బాలను పోలీసులు నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. కషఫ్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరించింది. అయితే పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని వారికి షరతులు విధించింది.