: ట్రంప్ తరపున ఇండో అమెరికన్ల ప్రచారం


అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం చేయాలని ఇండో అమెరికన్లు నిర్ణయించారు. ఇటీవల ఐయోవా కాకస్ రాష్ట్రంలో జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో సెనెటర్ టెడ్ క్రూజ్ పై ట్రంప్ ఓడిపోయారు. దాంతో తదుపరి ఎన్నికలు జరిగే న్యూహ్యాంప్ షైర్ లో ఆయన తరపున ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 'ఇండియన్ అమెరికన్స్ ఫర్ ట్రంప్ 2016' అనే పొలిటికల్ యాక్షన్ కమిటీని వారు ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందటే సమావేశమైన ఇండో అమెరికన్లు ట్రంప్ కి ఓటు వేయాలంటూ న్యూహ్యాంప్ షైర్ లో ఇండో అమెరికన్ లను చైతన్య పరచాలని నిర్ణయించారు. అంతేగాక మీడియా ద్వారా వారు ప్రచారం చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News