: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెట్టింగ్...ఆరు నెలల నిషేధం!


ఆస్ట్రేలియాలోని పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే మహిళా క్రికెటర్ పీపా క్లీరే (19) బెట్టింగ్ కు పాల్పడిన విషయం ఇటీవలే వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ఏ క్రికెట్ మ్యాచ్ లోను ఆరు నెలల పాటు పాల్గొనడానికి వీలులేకుండా ఆమెపై వేటువేశారు. అంతేకాకుండా, ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్ బాష్ లీగ్ నుంచి 18 నెలలు పాటు ఆమెను సస్పెండ్ చేశారు. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా క్లీరే పదకొండు డాలర్ల బెట్టింగ్ కు పాల్పడింది. కాగా, గత డిసెంబర్ లో బెట్టింగ్ కు పాల్పడిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ రీక్స్ పై రెండేళ్ల పాటు నిషేధం విధించారు.

  • Loading...

More Telugu News