: విశాఖలో అంతర్జాతీయ 'ఫ్లీట్ రివ్యూ'ను ప్రారంభించిన చంద్రబాబు
విశాఖ సాగరతీరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తరువాత బీచ్ రోడ్డులోని 'విక్టరీ ఎట్ సీ' స్థూపం వద్ద అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. మరికాసేపట్లో ఆంధ్రా యూనివర్సిటీలో ఐఎఫ్ఆర్ గ్రామాన్ని లాంఛనంగా చంద్రబాబు ప్రారంభించనున్నారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పేలా ఐఎఫ్ఆర్ గ్రామాన్ని రూపొందించారు. నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ వచ్చిన మార్పుల సమాహారంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రక్షణ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పొతే, ఈ ఫ్లీట్ రివ్యూలో 27 దేశాలకు సంబంధించిన 80 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి.