: మరింత ప్రియం అవుతోన్న బంగారం
గతేడాది 26 వేలలోనే కాస్త అటుఇటుగా ఉన్న బంగారం ధర కొత్త ఏడాదిలో పైపైకి వెళుతూనే ఉంది. వేసవిలో పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో ఏరోజుకారోజు పసిడి మరింత ప్రియం అవుతోంది. ఇవాళ మార్కెట్లో రూ.175 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.27,575 కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.650 పెరగడంతో కేజీ వెండి రూ.35,700కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకోవడం, ప్రపంచం మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో వీటి ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.