: అశోక్ చవాన్ ను ప్రశ్నించేందుకు సీబీఐకి గవర్నర్ అనుమతి
మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని, కోర్టు చుట్టూ తిరిగిన ఆయన ఇక ఇప్పుడు సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ మేరకు చవాన్ ను ప్రశ్నించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సీబీఐకి అనుమతి ఇచ్చారు. అయితే ఎప్పుడు ఆయనను ప్రశ్నిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.