: గవర్నర్ తో గంటకుపైగా సీపీ సమావేశం!
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో హైదరాబాద్ నగర సీపీ మహేందర్ రెడ్డి గంటకు పైగా సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికల రోజున పాతబస్తీలో చోటుచేసుకున్న పరిణామాల గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గవర్నర్ స్పష్టమైన సూచనలు చేశారు. పాతబస్తీలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని, బాధితులకు న్యాయం చేయాలని సీపీని గవర్నర్ ఆదేశించారు.