: ఇస్లాం ప్రజలను అనుమానంతో చూడటం సరికాదు: ఒబామా


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. పారిస్, కాలిఫోర్నియా ఉగ్రదాడుల తరువాత ఆమెరికన్ ముస్లింలపై వివక్ష పెరుగుతోందని, ఇలా ప్రవర్తించడమంటే అన్ని మత విశ్వాసాలపైనా దాడి చేయడమేనని అన్నారు. ఇలా ఒక వర్గం ప్రజలను అనుమానంతో చూడటం అమెరికా సామాజిక నిర్మాణానికి విఘాతం కలిగించడమేనని ఘాటుగా స్పందించారు. కొందరు దుండగుల చర్యలకు మొత్తం ఇస్లాం సమాజాన్నే శంకించడం తప్పని స్పష్టం చేశారు. దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ఒబామా ఇలా పరోక్షంగా ఖండించారు. మేరీల్యాండ్ ప్రాంతంలోని బాల్టిమోర్ మసీద్ ను అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఒబామా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం వర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News