: ఓలా సీఈఓ భవిశ్ అగర్వాల్ పిన్ని, నానమ్మల దారుణ హత్య!
ఓలా పేరిట క్యాబ్ సేవల సంస్థను ప్రారంభించి అనతికాలంలోనే వేల కోట్ల రూపాయల టర్నోవర్ సంస్థగా మార్చిన యువ ఔత్సాహిక వ్యాపారవేత్త భవిశ్ అగర్వాల్ దగ్గరి బంధువులు దారుణ హత్యకు గురయ్యారు. లూధియానాలోని భవిశ్ ఇంట్లో పిన్ని, గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్న సరితా అగర్వాల్ (57), నానమ్మ పుష్పవతీ అగర్వాల్ (84)ల హత్య జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తులు వీరిని చంపారని తెలుస్తోంది. హత్యలకు ముందు వీరి ఇంటి నుంచి పోలీసు కంట్రోల్ రూంకు ఓ బ్లాంక్ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ కాల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకులేదు. హత్యలు వెలుగులోకి వచ్చాక, బ్లాంక్ కాల్ పై దృష్టి పెట్టిన పోలీసులు, పనిమనిషిని విచారిస్తున్నారు. డబ్బు కోసం వచ్చిన దుండగులు హత్యకు పాల్పడి వుండవచ్చని భావిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.