: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు... 25న రైల్వే, 29న సాధారణ బడ్జెట్


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకు తొలి దఫా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు రెండో దఫా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఇవాళ సమావేశమైన కేబినెట్ వ్యవహారాల కమిటీ సమావేశాలు నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ నెల 23న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. 25న రైల్వే బడ్జెట్, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది.

  • Loading...

More Telugu News