: ఇక ఐఐఎంసీ వంతు... ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అవమానిస్తూ కామెంట్స్, విచారణకు ఆదేశం


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రోజుల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు పర్యాయాలు వర్సిటీకి వచ్చారు. విద్యార్థులతో కలిసి ఉద్యమించారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ (ఐఐఎంసీ)’ హెచ్ సీయూ బాటలోనే నడుస్తోంది. ఐఐఎంసీలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అవమానపరిచేలా కామెంట్లు వినపడ్డాయి. సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ వర్సిటీలో కలకలం రేపుతున్నాయి. హెచ్ సీయూ ఘటన నేపథ్యంలో కాస్తంగా వేగంగా స్పందించిన ఐఐఎంసీ అధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News