: ముందే వచ్చిన ఎండాకాలం... ఒక్కసారిగా 6 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత!


హైదరాబాద్ నగర వాసులు అప్పుడే ఎండాకాలాన్ని చవి చూస్తున్నారు. శివరాత్రి రాకుండానే, చలి పులి 'శివ శివా' అనకుండానే ఎగిరిపోతోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పొడి గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న పగటి పూట అత్యధికంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సాధారణ పరిస్థితుల కంటే ఇది 6 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఇంతటి ఉష్ణోగ్రత ఫిబ్రవరి ఆఖరు వారంలోనే కనిపిస్తుంది. ఈ సంవత్సరం మాత్రం ముందే వచ్చింది. గడచిన మూడేళ్లలో ఫిబ్రవరి తొలివారం ఎండ తీవ్రత ఇంత అధికంగా ఉంటడం ఇదే తొలిసారి. కాగా, రాత్రిళ్లు, ముఖ్యంగా తెల్లవారుఝామున మాత్రం చలిగాలులు పలకరిస్తున్నాయి. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో ఉక్కపోత సైతం పెరుగుతోంది.

  • Loading...

More Telugu News