: ఇక తాత్కాలిక అమరావతి... శంకుస్థాపన ముహూర్తం ఖరారు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని పక్కనబెట్టి, తాత్కాలిక భవంతులను కట్టించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 12న తెల్లవారుఝామున 4:15 గంటలకు తాత్కాలిక సచివాలయం తదితర భవనాలకు శంకుస్థాపన పనులను జరిపించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సిద్ధాంతులను సంప్రదించిన ప్రభుత్వ వర్గాలు, వారు నిశ్చయించిన ముహూర్తాన్ని చంద్రబాబుకు తెలిపాయి. ఇక తాత్కాలిక రాజధాని నిర్మాణం శంకుస్థాపన పెద్దగా హడావుడి లేకుండా ముగించాలని భావిస్తున్న ప్రభుత్వం ఎవరినీ అతిథులుగా ఆహ్వానించబోవడం లేదని సమాచారం. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తవుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News