: టాంజానియా యువతిని వివస్త్రను చేసిన ఘటనలో చర్యలు... ఐదుగురు అరెస్టు


బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి, భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై టాంజానియా హైకమిషనర్ జాన్ కిజాజి బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా... కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ స్పందించారు. ఘటన ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ట్విట్టర్ లో తెలిపారు.

  • Loading...

More Telugu News