: కదులుతున్న 'బీసీ'తుట్టె... మంజునాథ కమిటీ నివేదిక త్వరగా కావాలంటున్న బాబు సర్కారు!


వెనుకబడిన కులాల్లో ఎవరికీ అన్యాయం జరుగకుండా కాపులను చేర్చే అంశంపై నివేదిక కోరుతూ ఏర్పాటైన మంజునాథ్ కమిటీని మరింత త్వరగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సర్కారు కోరనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కమిటీలో ఖాళీగా ఉన్న ముగ్గురు సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని కూడా నేడు తేల్చేయాలని భావిస్తున్న చంద్రబాబు మంజునాథ్ తో నేడు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. కమిటీ విధివిధానాలను చర్చించడంతో పాటు, మిగిలిన సభ్యుల నియామకం, ఆపై కాలపరిమితి తదితర అంశాలపై ఆయనతో మాట్లాడనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిర్ణీత గడువు కంటే సాధ్యమైనంత ముందుగానే రిపోర్టును ఇవ్వాలని ఆయన కోరవచ్చని తెలిపాయి. ముగ్గురు సభ్యుల నియామకంపై తుది నిర్ణయం తీసుకుని, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. మరోవైపు బీసీ సంఘాలు ఈ సమాచారాన్ని జీర్ణించుకోలేక పోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీల్లో కాపులను కలిపితే తాము ఉద్యమిస్తామని ఇప్పటికే పలువురు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News