: అమరావతి సచివాలయ నిర్మాణానికి స్పందించని కంపెనీలు... రెండే టెండర్లు!


నవ్యాంధ్ర నూతన రాజధాని నగరం అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లకు నిర్మాణ రంగ కంపెనీలు పెద్దగా స్పందించలేదు. టెండర్లు ముగిసే సమయానికి ఎల్.అండ్.టీ, షాపూర్ జీ - పల్లోంజీ కంపెనీలు మాత్రమే తమ బిడ్లు దాఖలు చేశాయి. దీంతో ఈ రెండు సంస్థల్లో ఓ దానికి సెక్రటేరియట్ భవంతి నిర్మాణ కాంట్రాక్టు లభించనుంది. వీటిల్లో తక్కువగా కోట్ చేసిన సంస్థకు 10న టెండర్లు ఖరారు చేస్తామని, ఆపై వెంటనే పనులు ప్రారంభించాల్సి వుంటుందని కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీయే) అధికారులు వెల్లడించారు. కాంట్రాక్టును నాలుగు నెలల్లో పూర్తి చేస్తే 2 శాతం, ఐదు నెలల్లో పూర్తి చేస్తే ఒక శాతం ప్రోత్సాహకమిస్తామని చంద్రబాబు సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోను జూన్ లోగా సెక్రటేరియట్ ను నిర్మించి, అమరావతి నుంచే పరిపాలన సాగించాలన్నది చంద్రబాబు అభిమతం.

  • Loading...

More Telugu News