: గన్నవరాన్ని వీడని పొగమంచు... మూడో రోజూ విమానాల రాకపోకలకు అంతరాయం
పొగమంచు ముసురు విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టును వీడలేదు. దట్టంగా అలముకున్న పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టులో గడచిన రెండు రోజులుగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తాజాగా నేటి ఉదయం వరుసగా మూడో రోజూ గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా దట్టంగా అలముకున్న పొగమంచు గన్నవరం ఎయిర్ పోర్టునూ చుట్టేసింది. దీంతో నేడు కూడా విమానాల రాకపోకలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.