: జాతీయ గీతాన్ని సక్రమంగా పాడలేకపోయిన 'ఆప్' ఎమ్మెల్యే...కెమెరాకు అడ్డంగా చిక్కిన వైనం


దేశ పౌరులుగా మనమంతా జాతీయ గీతం ‘జనగణ మన’ను సక్రమంగా పాడగలగాలి. అందుకే మనకు పాఠశాల స్థాయిలోనే జాతీయ గీతాన్ని కంఠతా నేర్పించడం జరుగుతోంది. ఈ విషయంలో సాధారణ పౌరులు సహా ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు లేదు. ఇదే నిబంధనను కాస్తంత కఠినంగా అమలు చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లలోనూ చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేసింది. అయితే మన పేరు మోసిన ప్రజా ప్రతినిధులు మాత్రం జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా పాడలేకపోతున్నారు. ఇలా జాతీయ గీతాన్ని సరిగా ఉచ్చరించలేక ఢిల్లీ ఎమ్మెల్యే ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీని చిక్కుల్లోకి నెట్టేశారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ నేత విశేష్ రవి జాతీయ గీతాన్ని సరిగ్గా ఆలపించలేకపోయారు. జాతీయ గీతాలాపనలో రవి ఇబ్బందులు పడిన వైనం కెమెరా కంటికి చిక్కిపోయింది. దీంతో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తల పట్టుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News