: ఆమెకు తెలియకుండా పర్సు కొట్టేశాడు...తనకి తెలియకుండా దొరికిపోయాడు!


చైనాలో నూతన సంవత్సర వేడుకల వేళ రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన చోరులు చాకచక్యంగా తమపని తాము కానిచ్చేస్తున్నారు. దీంతో తమ పర్సులు పోయాయని, విలువైన వస్తువులు పోయాయని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రతి ఏటా జరిగే తంతు అయినా ఈసారి పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో చైనాలోని ఇన్నర్ మంగోలియాలోని హోహోట్ రైల్వే స్టేషన్ లో ఎక్కాల్సిన ట్రైన్ అందుకునేందుకు ఓ మహిళ వేగంగా వెళ్తోంది. ఇంతలో రంగ ప్రవేశం చేసిన దొంగ చాకచక్యంగా ఆమె బ్యాగులోని పర్సును కొట్టేశాడు. ఒక్క సెకెనులో తప్పించుకునేవాడే, ఇంతలో మఫ్టీలో ఉన్న పోలీసులు సదరు దొంగగారి చోరకళని ఇట్టే పసిగట్టేసి వెంటనే అతడిని ఒడిసి పట్టేశారు. దీంతో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ తంతంగమంతా సీసీ టీవీ పుటేజ్ లో రికార్డు కావడంతో, లీకైన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News