: ఉగ్రవాద వ్యతిరేక సంస్థ చైర్మన్ కు ఐఎస్ బెదిరింపు!
అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ చైర్మన్ ఎంఎస్ బిట్టాకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ మేరకు ఆయన వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని బిట్టా నివాసానికి ఈ లేఖ వచ్చినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ లోని ఐఎస్ విభాగం నుంచి ఈ లేఖ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ చైర్మన్ తో పాటు జాతీయ కార్యదర్శి, పలువురు నాయకులకు కూడా ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలిపారు.