: 'అవును నా దగ్గర బాంబుంది...విమానాన్ని పేల్చేస్తా'నంటూ అరిచిన ప్రయాణికుడు!


'అవును నా దగ్గరున్నది బాంబే...దానితో విమానాన్ని పేల్చాస్తా'నంటూ ఓ యువకుడు ప్రకటించడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే...ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఎక్కేందుకు ఓ ప్రయాణికుడు విమానాశ్రయానికి వచ్చాడు. సెక్యూరిటీ తనిఖీల సందర్భంగా అతని వద్ద మెటల్ వస్తువు ఉన్నట్టు తెలియడంతో అతనిని రెండుసార్లు తనిఖీ చేశారు. మూడోసారి కూడా అతనిని చెక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రయాణికుడు 'అవును అది బాంబే...దానితో విమానాన్ని పేల్చేస్తా' అంటూ అరిచాడు. దీంతో బెంబేలెత్తిపోయిన విమానాశ్రయాధికారులు ఆ విమానాన్ని ఆపేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద కానీ, విమానంలో కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకకపోవడంతో, అతనిని ప్రశ్నించారు. మూడు సార్లు చెక్ చేయడంతో కోపం వచ్చి అలా అన్నానని తెలిపాడు. దీంతో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ విమానం ఎక్కేందుకు కుమార్తెతో కలిసి వచ్చిన ప్రియాంకా గాంధీ వేరే విమానంలో చెన్నై వెళ్లారు.

  • Loading...

More Telugu News