: షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్ పై వీహెచ్ పీ మండిపాటు!
గుజరాత్ లో జరుగుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్ ను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. భుజ్ ప్రాంతంలో షారుఖ్ సినిమా ‘రాయిస్’ షూటింగ్ వద్ద వీహెచ్ పీ కార్యకర్తలు ఈరోజు ఆందోళన నిర్వహించారు. దేశంలో మత అసహనం పెరిగిపోయిందంటూ షారుఖ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ పీ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ చిత్రం షూటింగ్ కు అనుమతివ్వవద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కు ఈరోజు వినతిపత్రం సమర్పించారు. అనంతరం షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వారు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.