: అనుష్కపై కోపంతో గడ్డం తీసేసిన కోహ్లీ!


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరూ విడిపోయినట్టు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అనుష్కను వివాహం చేసుకుందామని భావించిన విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి పంజాబీ యువకుడిలా మారాలని గడ్డం కూడా పెంచడం ప్రారంభించాడు. ఇంతలో బాలీవుడ్ లో అనుష్కకు భారీ సినిమాల్లో నటించే అవకాశాలు తలుపుతట్టాయి. దీంతో వివాహానికి అనుష్క సిద్ధంగా లేనని కోహ్లీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కోహ్లీ గడ్డం తీసేసి, ఫేస్ బుక్ నుంచి అనుష్కను అన్ ఫ్రెండ్ చేశాడని సమాచారం.

  • Loading...

More Telugu News