: అయోవా రాష్ట్ర అంతర్గత ఎన్నికల్లో హిల్లరీ గెలుపు, ట్రంప్ ఓటమి


అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికలు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లకు షాకిచ్చాయి. అయోవా రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ పడుతున్న హిల్లరీ కొద్దిలో ఓటమిని తప్పించుకున్నారు. అదే పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న బెర్నీ సాండర్స్ పై స్వల్ప ఆధిక్యం సాధించి గెలుపొందారు. దాంతో హిల్లరీ జోరు పెరిగింది. ఇక రిపబ్లికన్ పార్టీ ప్రధాన అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమి చవిచూశారు. టెడ్ క్రూజ్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఓటమిని తీవ్రంగా పరిగణించడం లేదని ట్రంప్ అన్నారు. తమ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం 17 మంది పోటీ పడుతుంటే వారిలో ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారని తెలిపారు. వారందరిలో తాను రెండో స్థానంలో నిలిచానని పేర్కొన్నారు. త్వరలో న్యూ హాంప్ షైర్ లో అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News