: వాస్తవాల ఆధారంగా విచారణ జరుపుతున్నాం: టును ఘటనపై డీజీపీ రాముడు


తునిలో జరిగిన సంఘటన సభ్యసమాజం అంగీకరించేది కాదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. తుని ఘటనలో గాయపడిన పోలీసులను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రజల ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన కుట్రదారులను శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై పరుషంగా మాట్లాడి మరింత వివాదం రేపాలని తాను భావించడం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించామని చెప్పిన ఆయన, వాస్తవాల ఆధారంగా విచారణ జరుపుతున్నామని, దోషులను చట్టం ముందు నిలబెడతామని ఆయన చెప్పారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో మీడియా చూసిందని ఆయన చెప్పారు. దీనిపై ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా విచారణలో వాస్తవాలను వెలికి తీస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో నిర్దోషులను ఇబ్బంది పెట్టమని, దోషులను వదిలిపెట్టమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News