: దళితులైనా...అంబేద్కర్, సంజీవయ్య మాకు రిజర్వేషన్లు కల్పించారు: ముద్రగడ
దళితులైనప్పటికీ అంబేద్కర్, దామోదరం సంజీవయ్య తమ వర్గానికి మేలు చేశారని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. 1915లో అంబేద్కర్ బ్రిటన్ వెళ్లి మరీ కాపు రిజర్వేషన్ల కోసం పని చేశారని తన మిత్రులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, భారత దేశంలో ఎంతో కాలంగా కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని అన్నారు. ఇప్పుడు వాటినే అడుగుతున్నామని ఆయన చెప్పారు. కమిషన్ల పేరుతో కాలయాపన చేయవద్దని ఆయన సూచించారు. ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లేలా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. తమ జాతికి సంబంధించిన డేటా మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ఉందని ఆయన చెప్పారు. సీఎం తలచుకుంటే కాపులకు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు.