: సార్ రమ్మంటున్నారంటూ ఆ రోజు కొందరు నా భార్యను కూడా అవమానించారు: ముద్రగడ
సార్...రమ్మంటున్నారని పిలిచి, నా భార్యను కూడా ఆ రోజు కొందరు అవమానించారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, ఆందోళన జరుగుతున్నప్పుడు నలుగురు వ్యక్తులు గెస్ట్ హౌస్ లో ఉన్న తన భార్యవద్దకు వెళ్లి సర్ రమ్మంటున్నారని చెప్పారట. నేనైతే ఆవిడను పిలవలేదు. 'మరి, వాళ్లెవరో.. ఎందుకలా అన్నారో' అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడపైనున్న వాటర్ ట్యాంక్ ధ్వంసం చేశారని, తాను కూడా అవమానానికి గురయ్యానని ఆయన చెప్పారు. కమీషన్లతో కాలయాపన చేయడం సరికాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. ఓ జీవో జారీ చేస్తే కాపులకు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలా కాకుండా ఇతర బీసీ సంఘాల సోదరులతో చర్చలు జరపడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరికాదని ఆయన సూచించారు.