: పాయకాపురంలోని ఆ వెంచర్ వైపు వెళ్లే ప్రేమ జంటలే వారి లక్ష్యం!
ప్రేమ జంటల బలహీనతను అడ్డం పెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్న ముఠాను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ లో వారు చెప్పిన విషయాలు విన్న పోలీసులు షాక్ తిన్నారు. కాలేజీకి, డ్యూటీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి బయటకు వచ్చే కొంతమంది యువత, ప్రేమ పేరుతో ఏకాంత ప్రదేశాలకు వెళ్తుంటారు. విజయవాడకు సమీపంలోని పాయకాపురంలో 200 ఎకరాల్లో ఓ సంస్థ వెంచర్ వేసింది. అక్కడ చాలా ప్లాట్లు ఖాళీగా ఉంటాయి. విశాలమైన ప్రదేశం కావడంతో ప్రేమపక్షులు సాధారణంగా అక్కడ వాలిపోతుంటాయి. ఇలా చేరుకున్న వారిని వినోద్ కుమార్, నాగరాజు, దుర్గాప్రసాద్, మనోజ్ అనే నలుగురు యువకులు అటకాయిస్తారు. వారి ఇళ్లలో చెబుతామని, పోలీసులకు పట్టిస్తామని బెదిరిస్తారు. అంతే, అంతవరకూ గోప్యంగా విహరిస్తున్నామని భావించే ప్రేమికులు ఇంట్లో వాళ్లు, పోలీసులు అనడంతో భయపడిపోతారు. దీంతో వారిని నిలువుదోపిడీ చేసిన తరువాత ఆ జంటలో మహిళపై అత్యాచారానికి పాల్పడతారు. ఇలా ఇప్పటివరకు ఈ దుండగులు 20 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు వెల్లడించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. తాడేపల్లి సీతానగర్ లో ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన ఈ ముఠా ఆ ఇంటి యజమాని కుమార్తెపై అత్యాచారానికి యత్నించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు ఇంటరాగేషన్ లో వీరి దురాగతాలు కక్కించింది.