: ఇలా అయితే హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుంది?: వీహెచ్
హైదరాబాద్ లోని పాతబస్తీలో ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘటనపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు నియంత్రణలో లేకుంటే హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎంఐఎంను నెత్తికెక్కించుకోవద్దని వైఎస్ కు ఆనాడు తాను చెప్పానని, కానీ వారిని చేరదీసి తాము మోసపోయామని తెలిపారు. ఇప్పుడైనా సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎంఐఎం నేతలు ఉగ్రవాదుల్లా ప్రవర్తించారని, తమ పార్టీ నేతలపై దాడి చేసిన ఒవైసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.