: కొత్త రిజర్వేషన్లు గానీ, మార్పులు గానీ ఉండవు: కుండ బద్దలు కొట్టిన ప్రధాని మోదీ


ఇండియాలో కొత్తగా రిజర్వేషన్లు ప్రకటించడం గానీ, ఉన్న రిజర్వేషన్లలో మార్పులుగానీ ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో పర్యటిస్తున్న ఆయన, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి, దళితులకు మధ్య దూరాన్ని పెంచాలని చూస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడులో ఉన్న 21 శాతం మంది ఓటర్లు దళితులని గుర్తు చేసిన ఆయన, వారికున్న రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోను మార్చబోమని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లలో మార్పులు సైతం చేయబోమని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ, ఏ పార్టీతో పొత్తుకు యత్నిస్తున్నామన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. కాగా, మధురైలో పర్యటించిన అమిత్ షా మరో సభలో ప్రసంగిస్తూ, పల్లారులు, వారి అనుబంధ ఉప కులాలకు ఎటువంటి అన్యాయాన్ని జరగనివ్వబోమని తెలిపారు. తమిళనాట చెరకు రైతుల కోసం రూ. 6 వేల కోట్లను విడుదల చేసిందని, ఈ మొత్తాన్ని చెరకు కర్మాగారాల నుంచి కాకుండా, డైరెక్ట్ గా రైతులకే అందిస్తామని ఆయన తెలిపారు. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News