: ఇండియాలో తయారుకానున్న బోయింగ్ యుద్ధ విమానాలు!


విమానయాన రంగంలో సేవలందిస్తున్న బోయింగ్, ఇండియాలో యుద్ధ విమానాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని భావిస్తోంది. ప్రధాని మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా ఎఫ్/ఎ-18 ఫైటర్ జెట్ విమానాల తయారీని ఇక్కడ ప్రారంభించాలన్నది బోయింగ్ అభిమతం. ఇండియాకు రావాలని మోదీ స్వయంగా సంస్థను కోరిన మీదట, ఇక్కడైతే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్న బోయింగ్, త్వరలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇండియాకు రానుందని సమాచారం. ఎఫ్18 విమానాలను ఇండియాలో తయారు చేసే దిశగా ఆలోచిస్తున్నామని బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ ఎ మిలెన్ బర్గ్ వెల్లడించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మేకిన్ ఇండియా వ్యూహం, ఇక్కడ సంస్కరణల అమలు ఆధారంగా తమ పెట్టుబడులు ఉంటాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News