: అవన్నీ ఒట్టి పుకార్లే!... అష్పల్ తో ఎంగేజ్ మెంటే కాలేదంటున్న హాకీ కెప్టెన్


తనపై వచ్చిన అత్యాచార యత్నం ఆరోపణలను భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కొట్టిపారేశాడు. సర్దార్ సింగ్ తో తనకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని, ఈ క్రమంలో అతడు తనపై అత్యాచార యత్నం చేశాడని బ్రిటన్ కు చెందిన హాకీ ప్లేయర్ అష్పల్ భోగాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపణలతో సరిపెట్టని ఆమె, సర్దార్ సింగ్ పై లుధియానాలోని కూమ్ కలాన్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు కూడా చేేసింది. దీనిపై సమాచారం అందుకున్న సర్దార్ సింగ్ కొద్దిసేపటి క్రితం స్పందించాడు. అష్పల్ తో తనకు ఎంగేజ్ మెంటే జరగలేదని చెప్పిన అతడు, ఆమెపై తాను అత్యాచార యత్నం చేయబోయానంటూ వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని కొట్టిపారేశాడు. ప్రస్తుతం హాకీ ఇండియా లీగ్ లో భాగంగా నిన్న రాత్రి ఓ మ్యాచ్ లో పాల్గొన్నానని, రేపు మరో మ్యాచ్ కు సిద్ధమవుతున్నానని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వివాదంపై పూర్తి వివరంగా మాట్లాడతానని అతడు చెప్పాడు.

  • Loading...

More Telugu News