: 'జికా' వైరస్ కు విరుగుడు కనుగొన్న ఇండియన్ సంస్థ!
ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనల్లోకి నెట్టిన 'జికా' వైరస్ కు విరుగుడును తాము కనిపెట్టామని భారత్ బయోటెక్ ప్రకటించింది. జికా వైరస్ ను నిరోధించే వాక్సిన్ ను తయారు చేస్తున్నామని ప్రకటించింది. రెండున్నరేళ్లుగా ఈ వైరస్ నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా పరిశోధనలు సాగిస్తున్నామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి ఒకరు, పరిశోధనల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయని తెలిపారు. తమ వాక్సిన్ జికా వైరస్ ను సమర్థవంతంగా నిరోధించిందని వివరించారు. డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వ అనుమతులు రాగానే వాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని, అందుకు మరో రెండున్నరేళ్ల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. ఈ వాక్సిన్ కు 'జికా వాక్' అని పేరు పెట్టామని, అదే పేరుతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.