: జగన్ గారూ... మీ పార్టీ పేరును ‘పరామర్శల పార్టీ’గా మార్చుకోండి: సోమిరెడ్డి సూచన


వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం పరామర్శలకు మాత్రమే పరిమితమైన జగన్... తన పార్టీ పేరును ‘పరామర్శల పార్టీ’గా మార్చుకోవాలని సోమిరెడ్డి సూచించారు. హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సోమిరెడ్డి జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఎప్పుడో ఏళ్ల క్రితం చనిపోయిన వారి గురించి ఆయా వ్యక్తుల కుటుంబాలకు మళ్లీ గుర్తు చేస్తూ జగన్ ఆయా కుటుంబాలను ఆవేదనలో ముంచేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల కేసుల్లో చిక్కుకున్న జగన్ కు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని విమర్శించే అర్హత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు నిజాయతీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News