: రాజమహేంద్రవరంలో ఏపీ డీజీపీ రాముడు... తుని ఘటనపై ఆరా తీస్తున్న వైనం


తూర్పు గోదావరి జిల్లా తునిలో మొన్న కాపు నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన ‘కాపు ఐక్య గర్జన’ పెను విధ్వంసానికి దారి తీసింది. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసిన ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సభకోసమొచ్చిన కాపు నేతలు ధ్వంసరచనకు దిగారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టడమే కాక పోలీస్ స్టేషన్లపైనా దాడికి దిగారు. ఈ దాడుల్లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు వాహనాలు కాలి బూడిదయ్యారు. కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ముఖ్య నగరం రాజమహేంద్రవరం చేరుకున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిపై ఆయన స్థానిక పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News