: నేటి తరం హీరోయిన్లంతా పొడగరులే!: బిగ్ బీ అమితాబ్ బచ్చన్
నేటి తరం హీరోయిన్లపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న హీరోయిన్లంతా పొడగరులేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ నిర్వహిస్తున్న ‘ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాత తరం నటీమణుల కంటే నేటి తరం హీరోయిన్లు ఎత్తులోనే కాక ప్రతిభ పరంగానూ సమర్ధులేనని ఆయన కొనియాడారు. కొన్ని సందర్భాలలో కొత్త నటీమణుల వద్ద నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉంటున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చిత్రాల ఎంపికలోనే కాక పనితీరులోనూ వారు తీసుకుంటున్న నిర్ణయాలు హర్షించదగ్గవిగా ఉంటున్నాయని బిగ్ బీ పేర్కొన్నారు.