: నీ కొడుకు ఇద్దరిని చంపాడు, గొంతులు కోశాను... పాక్ లో ఉన్న మహిళతో 'పఠాన్ కోట్' ఉగ్రవాది జరిపిన ఫోన్ సంభాషణ పూర్తి వివరాలు!
జనవరి 1న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడు జరిపిన ఫోన్ కాల్ సంభాషణ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆభరణాల వ్యాపారి రాజేష్ వర్మ నుంచి సెల్ ఫోన్ లాగేసుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు పాక్ లోని +92 3000957212 నంబరుకు కాల్ చేశాడు. ముష్కరుడు నాజిర్ ఈ ఫోన్ ద్వారా మొత్తం 18 నిమిషాల పాటు మాట్లాడాడు. తన సోదరుడు బాబర్, తల్లి, మేనమామలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ సంభాషణ పూర్తి పాఠం... నాజిర్: అస్సలామ్ వాలేకుమ్, నేను నాజిర్ ను. మేనమామ: వాలేకుమ్ అస్సలామ్, ఎక్కడున్నావు? క్షేమమేనా? నాజిర్: నేను మరో దేశంలో ఉన్నాను. అమ్మెక్కడ? మేనమామ: త్వరగా ఆమెతో మాట్లాడు. తల్లి: బాబూ, ఎక్కడున్నావు? బాగున్నావనే అనుకుంటున్నా. నాజిర్: మేము ఇండియాలో ఉన్నాము. నీ కొడుకు ఇద్దరిని చంపాడు. వారి గొంతులను నేను కత్తులతో కోశాను. ఇక చివరి పోరుకు మేం సిద్ధమవుతున్నాం. నాతో ఉన్నవారు పట్టుబడతామేమోనని భయపడుతున్నారు. ఇండియాలో ఉండగా భయం వద్దని వారికి చెప్పాను. తల్లి: నువ్వు ధైర్యవంతుడివి. స్వర్గానికి వెళ్లేందుకు అల్లా నీకు సహకరిస్తాడు. నాజిర్: నువ్వు నాకోసం కుట్టించిన జాకెట్ నే ఇప్పుడు ధరించాను. తల్లి: నువ్వసలు ఇండియా లోపలికి ఎలా వెళ్లగలిగావు? నాజిర్: పెద్ద ఎస్యూవీల్లో మేం వెళ్లాం. లాండ్ క్రూయిజర్ మమ్మల్ని సరిహద్దుల్లో విడిచి వెళ్లింది. తల్లి: ఏమైనా తిన్నావా? నాజిర్: డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు తిన్నా. ఇంకేమీ లేదు. తల్లి: నువ్వే 'కాఫిర్' (ముస్లిం మతాన్ని నమ్మని వాళ్లు) లను చంపావా? నాజిర్: మొత్తం చెప్పడానికి సమయం లేదు. ఇదే నా చివరి కాల్. దీన్ని రికార్డు చేసి పెట్టుకోండి. తల్లి: రికార్డింగ్ ఎలా చేయాలో నాకు తెలియదు. నాజిర్: బాబర్ చేస్తాడు. రికార్డింగ్ ఎలా చేయాలో అతనికి తెలుసు. (ఆపై ఫోన్ రికార్డర్ ను ఆన్ చేసి బాబర్ మాట్లాడాడు) నాజిర్: బాబర్... నేను బలిదానం చెందానన్న వార్తను విన్న తరువాత నువ్వు విందు చేసుకోవాలి. అంటూ ఫోన్ కాల్ ను ముగించాడు.