: ఆ రోజు ఏం జరిగింది?... అనుచరుల ఇళ్లకు వెళ్లి చర్చిస్తున్న ముద్రగడ
కాపు గర్జన సభ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం తన అనుచరుల ఇళ్లకు వెళ్లి చర్చిస్తున్నారు. ఈ ఉదయం మీడియా సమావేశం అనంతరం, తునిలోని తన అనుచరుల ఇళ్ల వద్దకు వెళ్లిన ఆయన, ఆ నాడు ఏం జరిగిందన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. తునికి చెందిన ఎవరైనా విధ్వంసాల్లో పాల్గొన్నారా? అంటూ అడిగిన ముద్రగడ, విధ్వంసం వెనుక మనవాళ్లెవరూ లేరని, కేసులు పెట్టి అరెస్టులు చేసినా భయపడవద్దని ధైర్యం చెబుతున్నట్టు సమాచారం. అనుచరులందరికీ తాను అండగా ఉంటానని ముద్రగడ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.