: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విరాళం
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విరాళం ఇచ్చింది. ఈ మేరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కార్పొరేషన్ ఛైర్మన్ ఎల్.వి.ఆర్.కె. ప్రసాద్ కలిశారు. రూ.1.40 కోట్ల చెక్ ను సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థల్లో మొదటిసారిగా భారీ మొత్తంలో సాయం చేసిన సంస్థ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అని అభినందించారు.