: ఢిల్లీలో కలకలం... కారులో తరలిస్తున్న 50 రివాల్వర్లు, 100 మేగజైన్లు స్వాధీనం


ఢిల్లీ ప్రత్యేక పోలీసు దళాలు సోదాలు జరుపుతున్న వేళ, పాయింట్ 32 బోర్ రకానికి చెందిన 50 రివాల్వర్లు, 100కు పైగా బులెట్లు నిండిన మేగజైన్లు పట్టుబడటం కలకలం రేపింది. దేశ రాజధానిలోకి ఆయుధాలు వస్తున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ విస్తృత సోదాలు చేస్తుండగా, ఓ కారులో ఇవి లభ్యమయ్యాయి. కారును నడుపుకుంటూ వస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జార్ఖండ్ నుంచి ఈ కారు వస్తున్నట్టు సమాచారం. ఆయుధాలు ఎక్కడి నుంచి సేకరించారు? అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు? వంటి విషయాలపై సమాచారం వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News